మార్చి 31లోగా చెల్లిస్తే.. 50% రాయితీ
AP: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31 వరకు ఛాన్స్ ఉంటుందని తెలిపింది.