తెనాలి డిపోను సందర్శించిన ఆర్టీసీ RM

తెనాలి డిపోను సందర్శించిన ఆర్టీసీ RM

GNTR: ఏపీ ఆర్టీసీ గుంటూరు రీజినల్ మేనేజర్ సీహెచ్. విమల బుధవారం తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా 'స్త్రీశక్తి పథకం' అమలు తీరును పరిశీలించారు. డిపో మేనేజర్ రాజశేఖర్‌తో పాటు కండక్టర్లతో మాట్లాడి, జీరో ఫేర్ టికెట్లు ఏ విధంగా ఇస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మహిళలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.