బాపట్ల కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్

బాపట్ల కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్

BPT: రెడ్ క్రాస్ సభ్యత్వాలలో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ వెంకట మురళీని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించి అవార్డు ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో బాపట్ల తహసీల్దార్ సలీమా కలెక్టర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెతో పాటు పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.