'ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’
BHNG: ఆలేరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జి అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లను, ఎన్నికల సామాగ్రిని పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.