సర్పంచ్‌గా గెలిచిన మూడు అడుగుల మహిళ
JN: చిన్నపెండ్యాల గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో కేవలం మూడు అడుగుల ఎత్తున్న మహిళ సర్పంచ్‌గా గెలుపొందారు. తిరుపతమ్మ అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 1621 ఓట్లు ఉండగా ఆమె 20 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తన ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను నిరూపించుకున్నారు. ఆమె గెలుపు ప్రజల నమ్మకానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.