వివక్షతకు వ్యతిరేకంగా కరపత్రాలు విడుదల

KRNL: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఢణాపురం సర్పంచ్ చంద్రశేఖర్‌పై చూపిన బహిరంగ కుల వివక్షతపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించక పోవడంతో దళిత, గిరిజన, మైనార్టీ సంఘాలు ఆగస్టు 6న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.