'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోండి'
PPM: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే కళావతి నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా పాలకొండలో కార్గిల్ జంక్షన్ నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు బుధవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకి వినతి అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.