షమీ ఆరోపణలను ఖండించిన బీసీసీఐ

షమీ ఆరోపణలను ఖండించిన బీసీసీఐ

తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ టీమిండియాకు ఎంపిక చేయలేదని మహ్మద్ షమీ చేసిన ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది. అతడిని గతంలో ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయాలని భావించినట్లు తెలిపింది. అందుకోసం ముందుగా IND-A తరఫున ఇంగ్లండ్‌కు పంపి అతడి ఫిట్‌నెస్ టెస్ట్ చేయాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ, షమీ తనకు ఇంకా సమయం కావాలని చెప్పడంతో అతడిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.