VIDEO: నడవలేని స్థితిలో రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు
KDP: కమలాపురం మండలం అప్పాయపల్లి శ్రీనగర్ కాలనీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. బురదమయంగా మారిన రోడ్లపై నడవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యపై స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం నడవడానికి వీలుగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.