35 మంది మత్స్యకారులపై కేసులు నమోదు

AKP: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నిరసన దీక్షలు చేస్తున్న 35 మంది మత్స్యకారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మొదటిరోజు 14వ తేదీన నిరసన దీక్షలో పాల్గొన్న 14 మందిపై కేసులు పెట్టామన్నారు. సోమవారం దీక్షలో కొనసాగిస్తు శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన మరో 21 మంది మత్యకారులపై కేసులు నమోదు చేసామని తెలిపారు.