VIDEO: కృష్ణాపురం నవోదయ పాఠశాల వద్ద ఆందోళన
NLR: మర్రిపాడులోని కృష్ణాపురంలోని జవహర్ నవోదయ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకొని నిరసన తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సంఘటనతో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.