వీధి కుక్కల బెడదపై కమిషనర్‌కు వినతి

KMM: వీధి కుక్కల దాడులతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం నగర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు తరచూ కుక్క కాటుకు గురవుతున్నారని నగర కార్యదర్శి ప్రతాపనేని శోభ చెప్పారు. కుక్కల్ని చంపకుండా పట్టుకొని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని కోరుతూ నగర కమిటీ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.