వివేకా హత్య కేసు.. ఆ అధికారులపై చర్యలు!
AP: వివేకానంద హత్య కేసులో సునీత దంపతులు, CBI అధికారిపై కేసులు పెట్టించిన అప్పటి అధికారులపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. విశ్రాంత ASP రాజేశ్వర్ రెడ్డి, ASI రామకృష్టా రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. 2023 DEC15న సునీత, CBI అధికారి రామ్ సింగ్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని తెలియడంతో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది.