20 నిమిషాల్లోనే 'ఉస్తాద్‌' ఓటీటీ డీల్ క్లోజ్

20 నిమిషాల్లోనే 'ఉస్తాద్‌' ఓటీటీ డీల్ క్లోజ్

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' సినిమా ఈనెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు హరీశ్‌ శంకర్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ సినిమా OTT హక్కుల డీల్ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తయిందని ఆయన తెలిపాడు. పవన్‌ క్రేజ్ దృష్ట్యా ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.