'నిర్ణీత ధరలకే విక్రయించాలి'

SDPT: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు డీలర్లు నిర్ణీత ధరలకు అమ్మాలని ఎక్కువ ధరలకే అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారిణీ రాధిక అన్నారు. దౌల్తాబాద్‌లో పలు ఫర్టిలైజర్ దుకాణాలను దుబ్బాక ఏడిఏ మల్లయ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డీలర్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు.