జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూర్ ఎమ్మెల్యే: మంత్రి

KKD: వైసీపీ అధినేత జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల గురించి తెలియకుండా జగన్ ఇప్పుడే రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవాలు గ్రహించాలని సూచించారు.