మంత్రిని కలిసిన జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు

మంత్రిని కలిసిన జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు

SRD: జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను మంగళవారం కలిశారు. మెడికల్ వైద్య కళాశాలలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్, ప్రధాన కార్యదర్శి అజయ్ పాల్గొన్నారు.