VIDEO: టూరిజం హబ్ గా.. గణపసముద్రం చెరువు
BHPL: గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువుకట్టపై రూ.10 కోట్లతో టూరిజం అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణం, చెరువు సుందరీకరణ, బోటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అధునాతన సాంకేతికతతో పనులు పురోగమిస్తున్నాయి. త్వరలోనే పూర్తి చేసి టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.