VIDEO: ఐ.బయనపల్లె వద్ద కొండచిలువ సంచారం
KDP: దువ్వూరు మండలం ఐ.బయనపల్లె సమీపంలో కడప-కర్నూలు హైవే పక్కన కొండచిలువ శుక్రవారం రాత్రి సంచరిస్తున్నట్లు వాహనదారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో పంట పొలాలు అధికంగా ఉండడంతో రైతులు,గొర్రెల కాపర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతంలో గతంలో కూడా కొండ చిలువ సంచరిస్తుండగా ప్రజలు గుర్తించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ సిబ్బంది సూచించారు.