ఆశా వర్కర్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
MHBD: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కురవి మండలం కందికొండ గ్రామ సర్పంచ్ తొడ్సు నాగార్జున్ సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని ఆశావర్కర్లకు శుక్రవారం ఆయన ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, తోడ్సు అర్జున్, తదితరులున్నారు.