జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

SRPT: తిరుమలగిరిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జిల్లేపల్లి జానయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైనందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం ఆయనను గురువారం ఘనంగా శాలువాలతో సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా జానయ్య ఎంపికవడం ఎంతో సంతోషదాయకమని ప్రిన్సిపాల్ మృత్యుంజయ అన్నారు.