ఆసుపత్రి నుంచి రోగి అదృశ్యం
KRNL: ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కురువ రవికుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆదోనిలోని విక్టోరియా పేటకు చెందిన అతను మానసిక సమస్యలతో బాధపడుతూ, అక్టోబర్ 19న చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. ఎవరైనా గుర్తించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.