కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ విస్తృత ప్రచారం

NLG: దేవరకొండ మండలంలో ఆదివారం మహా సంపర్క్ అభియాన్‌ను బీజేపీ మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ అధ్యక్షతన నిర్వహించారు. కట్టకొమ్ముతండాలో బూత్ అధ్యక్షుడు నేనావత్ సురేష్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా ప్రధాన కార్యదర్శి చనమోని రాములు తదితరులు పాల్గొన్నారు.