పుంగనూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

పుంగనూరులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

CTR: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం పుంగునూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో గ్రంథాలయ అధికారి తులసి నాయక్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాలు వాటి ఆవశ్యకత అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 20న బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు.