కాశీ విశ్వేశ్వరుడికి విశేష పూజలు

కాశీ విశ్వేశ్వరుడికి విశేష పూజలు

CTR: పుంగనూరు టౌన్‌లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్బయ్య దీక్షితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. రుద్ర నమక చమకాల మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శోభాయమానంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు.