అన్న క్యాంటీన్లో భోజనం చేసిన ఎంపీ
NDL: నంద్యాలలోని అన్న క్యాంటీన్‌ను బుధవారం ఎంపీ శబరి సందర్శించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో కలిసి ఆమె భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలు ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందిస్తూ ప్రజల ఆకలి తీర్చడంలో అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.