జవహర్ నగర్ లో జిమ్ కోచ్ ఆత్మహత్య

జవహర్ నగర్ లో  జిమ్ కోచ్ ఆత్మహత్య

మేడ్చల్: కాప్రా మండలం జవహర్నగర్ పీఎస్ పరిధిలో ఓ జిమ్ కోచ్ ఆదివారం సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిమ్ కోచ్ రమేశ్ (43) తొమ్మిదేళ్లుగా తన సోదరుడు, తండ్రితో కలిసి బాలాజీనగర్ ఆనంద్ నగర్ కాలనీలో ఉంటున్నాడు. భార్య విడాకులు, కుమార్తె దూరం కావడంతో అతడు మనోవేదనకు గురయ్యాడు. 'నాకు బతకాలని ఉంది కానీ బలవంతంగా చనిపోతున్నా' అంటూ సెల్ఫీవీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు.