ఈనెల 14 వరకు జిల్లాలో 163 సెక్షన్: ఎస్పీ

KMR: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.