విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

CTR: నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు నాదముని మాట్లాడుతూ.. ఈ మాత్రల వల్ల కడుపులోని నులిపురుగులను నివారించవచ్చని, రక్తహీనతను తగ్గించవచ్చని తెలిపారు.