ఏజెన్సీ ముఖద్వారంలో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు
ASR: గంజాయి, నాటుసారా నిర్మూలనకు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. శుక్రవారం ఏజెన్సీ ముఖద్వారమైన కొయ్యూరు మండలం భీమవరం పోలీస్ చెక్ పోస్టు వద్ద ఆమె తనిఖీలు నిర్వహించారు. బంగారమ్మపేట-అంతాడ రహదారి తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాను ఎగురవేశారు. తనిఖీలు నిర్వహించారు.