'సైబరాబాద్ స్పూర్తితో అమరావతిని తీర్చిదిద్దుతాం'
GNTR: హైదరాబాద్ అభివృద్ధికి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్ట్, ఐటీ రంగాలు ఎలా దోహదపడ్డాయో అమరావతి కూడా అదే తరహాలో అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి అనేది ఒకరోజుతో ఆగిపోయేది కాదని, అది నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. సైబరాబాద్ స్ఫూర్తితో అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.