నేడు కేబినెట్ భేటీ.. పలు పెట్టుబడులకు ఆమోదం!
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో SIPB ప్రతిపాదించిన రూ.39,436 కోట్ల విలువైన 31 భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు. దీని ద్వారా సుమారు 1.11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేంద్రానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు, రాయలసీమను సోలార్, విశాఖను ఐటీ హబ్‌లుగా మార్చే కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.