VIDEO: తడిసి ముద్దయిన తహశీల్దార్ కార్యాలయం
PPM: తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో పాలకొండ తహశీల్దార్ కార్యాలయం తడిసి ముద్దయింది. శిథిలావస్థకు చేరుకోవడంతో తహశీల్దార్ ఛాంబర్తో పాటు కార్యాలయం అంతా వర్షపు నీరుతో నిండిపోయింది. తహశీల్దార్ రాధాకృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. సిబ్బందికి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యాలయం మరమ్మతులు విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.