ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ కొలువులు
MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి తండాకు చెందిన బదావత్ వర్ధన్ కుటుంబంలో ముగ్గురు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు సాధించారు. కుమారుడు శివాజీ, కుమార్తె సంపూర్ణ గత ఏడాది నర్సింగ్ ఆఫీసర్లుగా ఎంపికవగా, తాజాగా కోడలు శోభ కూడా అదే కొలువు సాధించారు. గతంలో శివాజీ తండాలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.