BREAKING: చార్మినార్ వద్ద ఉద్రిక్తత
HYD: చార్మినార్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చార్మినార్ పాదచారుల జోన్‌ను క్రమబద్ధీకరించేందుకు అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో MIM సీనియర్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ కుమారుడు సాహిల్ అధికారులను అడ్డుకొనగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.