మరి కొద్ది రోజుల్లో పెళ్లి ఇంతలోనే విషాదం

MBNR: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన దేవరకద్రలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిన్న రాజమూరు వాసి అరుణ్ కుమార్ జిల్లాలోని సబ్‌స్టేషన్లో Jr. లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయడానికి వెళ్లి మరణించాడు. అరుణ్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయం అయినట్లు తెలిపారు.