VIDEO: పెరిగిన చలి.. స్వెట్టర్‌లకు డిమాండ్

VIDEO: పెరిగిన చలి.. స్వెట్టర్‌లకు డిమాండ్

NLG: జిల్లా కేంద్రంలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరగడంతో, స్వెట్టర్ల దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు స్వెట్టర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు. ఒక్కో దానిపై గతంలో కంటే రూ.200 నుంచి రూ. 300 వరకు అధికంగా తీసుకుంటున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.