స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SS: నల్లమాడలో స్వచ్ఛ రథాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి సూచించారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని కోరారు.