ఆర్థిక సమస్యలున్నా అభివృద్ధిలో రాజీ లేదు: ఆనం

ఆర్థిక సమస్యలున్నా అభివృద్ధిలో రాజీ లేదు: ఆనం

AP: గత YCP ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో రూ.27 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో రాజీ పడట్లేదని తెలిపారు. అటు జువ్వెలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నామంటూ YCP నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.