గ్యాస్ కొరత.. వాటిపైనే తీవ్ర ప్రభావం
HYD: నగరంలో LPG గ్యాస్ కొరతతో సేవా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర వ్యాప్తంగా సుమారు 300 అనాథ, వృద్ధాశ్రమాలున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం కారణంగా వారం రోజులుగా ఏర్పడిన గ్యాస్ సిలిండర్ల కొరత స్వచ్ఛంద సంస్థల అండతో నడిచే అనాథ, వృద్ధాశ్రమాలకు సకాలంలో సిలిండర్లు అందడంలేదు. ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకులు బ్లాక్ మార్కెట్‌లో కొనలేని పరిస్థితిలో ఉన్నారు.