కార్యాలయంపై దాడి హేయమైన చర్య: MLA
CTR: హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి యత్నాన్ని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించినందుకే మీడియాపై దాడులు చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి అంశంపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మీడియా స్వేచ్ఛను ఎవరూ అణచలేరని స్పష్టం చేశారు.