విశాఖలో మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్
VSP: టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.