దర్దేపల్లిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: నవీన్
JN: ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో దర్దేపల్లి గ్రామంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని పాలకుర్తి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పసునూరి నవీన్ అన్నారు. గ్రామంలో ఇవాళ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. పార్టీ సూచించిన అభ్యర్ధిని అధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.