ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా..?

ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా..?

ఏసీలో ఉన్న తర్వాత బయటకు రాగానే కొందరికి తలనొప్పి, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. మరికొందరికీ తలతిరగడం, మగత, ముక్కు దిబ్బడ, గొంతు పొడిబారడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.  ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల శరీరంలో నీరు తగ్గి, నీరసం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏసీ సరిగా శుభ్రం చేయకపోతే, దుమ్ము, అలెర్జీ కారకాలు కూడా ఈ సమస్యలను పెంచుతాయి.