ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్
HYD: నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్ధి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ అడ్మిషన్స్, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని PDSU డిమాండ్ చేసింది. ప్రభుత్వ GOను ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని PDSU నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.