కంఠమహేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

కంఠమహేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దేవుని గుట్టపై నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, గ్రేట్ అధ్యక్షులు సత్తూరు వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు.