స్థలం సేకరణకు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

NLG: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోయే ఇంటిగ్రెటెడ్ పాఠశాలకు అవసరమయ్యే స్థలానికి సంబంధించి మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మునుగోడు కేంద్రంలోనే నిర్మించాలనే తలంపుతో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉందనే విషయాలపై ఆరా తీశారు.