'విద్యార్థులతో సమావేశాలు నిర్వహించాలి'
విజయనగరం జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో పోలీసులు, జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎస్పీ దామోదర్‌ని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. గురువారం ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిశారు. ముఖ్యంగా మైనర్ యువత సెల్‌ఫోన్‌లకు చిక్కిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.