హైవేపై ధాన్యం ఆరబెడితే చట్టపరంగా చర్యలు
ASR: జాతీయ రహదారికి అనుకొని ఉన్న గ్రామాల్లో రైతులు పండిన పంటలను రహదారిపై ఆరబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంచామని రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ తెలిపారు. హైవేపై పండించిన పంటలు ఆరబెట్టడం, ధాన్యం బస్తాలు రోడ్డుపై ఉంచడం వల్ల వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. బీఎస్ఎస్ వాహన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.