వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన బీసీ రాజారెడ్డి..!

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన బీసీ రాజారెడ్డి..!

NDL: బనగానపల్లె మండలం సాదుకొట్టం గ్రామం వద్ద ఇవాళ ప్రధాన రహదారిపై నూతనంగా రూ. 12 లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.